![]() |
![]() |

బుల్లితెరపై కొత్త జంట సందడి చేస్తోంది. అదే వర్ష-ఇమ్మానియేల్ జంట. ఈ టీవీలో వాలెంటైన్స్‌డే సందర్భంగా 'రెండు గంటల్లో ప్రేమించడం ఎలా?' అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాంకర్ వర్షకు రెడ్ కలర్ లవ్ సింబల్ వున్న బెలూన్‌ని అందించి ఇమ్మానియేల్ లవ్ ప్రపోజ్ చేసిన విజువల్స్ ఇటీవల నెట్టింట సందడి చేశాయి.
అదే ఎపిసోడ్‌లో ఇమ్మానియేల్ తల్లిని వర్ష ఆప్యాయంగా కౌగిలించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో ఇమ్మానియేల్ పేరెంట్స్‌ని స్టేజ్ పైకి ఆహ్వానించారు. తన తల్లిదండ్రులు స్టేజ్‌పైకి రావడంతో ఇమ్మానియేల్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఎదుగుదలకు తన కుటుంబం ఎంతో చేసిందని, అన్నయ్య తన జీవితాన్ని త్యాగం చేసి తననింత వాడిని చేశాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇమ్మానియేల్‌ని చూసిన వర్ష కూడా ఎమోషనల్ అయ్యింది. స్టేజి మీదకు వచ్చి అతని తల్లిని ఆలింగనం చేసుకుంది. తన తండ్రి ఇటీవలే చనిపోయాడని, ఆ సమయంలో ఇమ్మానియేల్ తనకు అండగా నిలిచాడని కన్నీళ్లు పెట్టుకుంది వర్ష. "మీరొక మంచి అబ్బాయిని నాకిచ్చారు." అని ఇమ్మానియేల్ తల్లితో అనడంతో అందరూ చప్పట్లు కొడుతూ కేకలు వేశారు. "ఇమ్మానియేల్ వల్ల నీకే ప్రాబ్లమ్ రాదు." అని ఆమె కూడా హామీ ఇవ్వడంతో వర్ష సిగ్గుల మొగ్గ అయ్యింది. ఎనిమిదేళ్ల జబర్దస్త్‌లో ఇలాంటి జోక్ ఎవరూ వేయలేదని ఆది నవ్వించాడు. తమ అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్ అని రివీల్ చేశాడు ఇమ్మానియేల్.

![]() |
![]() |